నాయిని పాడె మోసిన కేటీఆర్‌, శ్రీనివాస్ గౌడ్

October 22, 2020
img

తెలంగాణ తొలి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు గురువారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అధికార లాంఛనాలతో పూర్తయ్యాయి. ఆయనను కడసారిగా చూసేందుకు భారీ సంఖ్యలో టిఆర్ఎస్‌ నేతలు, మంత్రులు, వివిద పార్టీల నేతలు, కార్మికనేతలు, టిఆర్ఎస్‌ కార్యకర్తలు, నాయిని అభిమానులు తరలివచ్చి  అశ్రునయనాలతో ఆయనకు తుదివీడ్కోలు పలికారు. మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్ గౌడ్ పాడె మోసి ఆయనపై తమకున్న గౌరవాన్ని చాటుకొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న నాయిని అర్ధాంగి కడసారి భర్తను చూసుకొనేందుకు వీల్ ఛైర్‌లో శ్మశానానికి రావడం చూసి అందరూ చలించిపోయారు.  కార్మికనేతగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, ప్రజాప్రతినిధిగా సేవలందించిన నాయిని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలి హోంమంత్రిగా పనిచేశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నాయిని జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుదవారం అర్దరాత్రి తుదిశ్వాస విడిచారు. 

Related Post