తంగేడు పక్షపత్రికను ప్రారంభించిన కల్వకుంట్ల కవిత

October 22, 2020
img

తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తంగేడు పక్షపత్రికను బుదవారం ప్రారంభించారు. తెలంగాణ జాగృతి అధ్వర్యంలో ప్రచురింపబడే ఈ పత్రిక తెలంగాణ సాహిత్యం, సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతిరూపంగా నిలుస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. ఈ పత్రిక www.thangedu.co.in ద్వారా ప్రజలకు ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉంటుందని కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ పత్రికకు ప్రధాన సంపాదకురాలిగా కల్వకుంట్ల కవిత, అసోసియేట్ ఎడిటర్‌గా డాక్టర్ కాంచనపల్లి గో.రా. ఉంటారు.      


Related Post