దుర్గం చెరువు బ్రిడ్జ్ ప్రారంభోత్సవం ఎప్పుడో?

September 21, 2020
img

హైదరాబాద్‌ నగరానికి సరికొత్త ఆకర్షణగా మారిన దుర్గం చెరువు కేబిల్ బ్రిడ్జ్ నిర్మాణపనులన్నీ పూర్తయి చాలా రోజులే అయ్యింది. ఈ నెల 19న సిఎం కేసీఆర్‌ స్వయంగా దానిని ప్రారంభోత్సవం చేస్తారని జీహెచ్‌ఎంసీ అధికారులు చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి కానీ ఇంతవరకు దానికి ప్రారంభోత్సవం కాలేదు. హైదరాబాద్‌లో గత 4-5 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నందున అవి పూర్తిగా తగ్గేవరకు ప్రారంభోత్సవాన్నివాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తాజా సమాచారం. కనుక జీహెచ్‌ఎంసీ లేదా ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడితే కానీ దుర్గం చెరువు కేబిల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం ఎప్పుడనేది తెలియదు. కానీ బ్రిడ్జికి ప్రారంభోత్సవం చేయకపోవడంతో ప్రతీరోజూ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వందలాది మంది తమ పిల్లలతో సహా వచ్చి దానిపై వాకింగ్ చేస్తూ హైదరాబాద్‌ అందాలను ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, యువతీయువకులు, యువ జంటల కేరింతలు, సెల్ఫీలతో దుర్గం చెరువు కేబిల్ బ్రిడ్జ్ చాలా సందడిగా ఉంటోంది. బ్రిడ్జి ప్రారంభోత్సవం జరిగితే రయ్యి రయ్యిమని వాహనాలు దూసుకుపోతుంటాయి కనుక ఇప్పుడే అందరూ హాయిగా బ్రిడ్జిపై అటు ఇటూ వాకింగ్, జాగింగ్ చేస్తూ, సెల్ఫీలు తీసుకొంటూ జనాలు ఆనందిస్తున్నారు. 

Related Post