ప్రగతి భవన్‌ ముందు యువకుడు ఆత్మహత్యాయత్నం

September 18, 2020
img

సిఎం కేసీఆర్‌ అధికారిక నివాసం ప్రగతి భవన్‌ ఎదుట ఈరోజు ఉదయం ఓ వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహుతికి ప్రయత్నించాడు. అయితే అక్కడే ఉన్న పోలీసులు వెంటనే అడ్డుకొని ఒంటికి నిప్పంటించుకోక మునుపే అతనిని కాపాడారు. అనంతరం అతనిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసుల సమాచారం ప్రకారం అతని పేరు చందర్. ఆటో డ్రైవరుగా పనిచేస్తున్నాడు. తెలంగాణ ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నాడు. తెలంగాణ సాధన కోసం 2010లో శాసనసభ ఎదుట ఆత్మహుతికి ప్రయత్నించాడు కానీ అప్పుడూ చుట్టుపక్కల ఉన్నవారు అడ్డుకొని ప్రాణాలు కాపాడారు. లాక్‌డౌన్‌ కారణంగా ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్న చందర్ తన కుటుంబానికి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కేటాయించాలని కోరుతూ ఆత్మహుతికి ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు.  


Related Post