ఈసారి ఖైరతాబాద్‌ గణేష్ విగ్రహం ఎత్తు 9 అడుగులే!

August 06, 2020
img

రాష్ట్రంలో ఖైరతాబాద్‌ గణేష్ విగ్రహానికి ఉన్న ప్రత్యేకత అందరికీ తెలిసిందే. ఏటా సరికొత్త రూపంతో మరింత ఎత్తుకి ఎదుగుతూ భక్తులకు దర్శనమిస్తుంటాడు. కానీ ఈసారి  కరోనా ప్రభావం ఖైరతాబాద్‌ గణేషునిపై కూడా పడింది. నగరంలో కరోనా వైరస్ వ్యాపిస్తున్నందున, గతంలోలాగా భారీ మండపాలలో భారీ విగ్రహాలు ఏర్పాటు చేసి భక్తులను అనుమతించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాగే గణేష్ నిమజ్జనం సందర్భంగా ఊరేగింపులు సాధ్యం కాదు. కనుక ఈసారి ఖైరతాబాద్‌ గణేష్ విగ్రహాన్ని కేవలం 9 అడుగుల ఎత్తుతో తయారు చేయాలని నిర్ణయించినట్లు ఉత్సవాకమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ తెలిపారు. అది కూడామట్టితో తయారుచేసి ప్రతిష్టించిన చోటే ప్విత్ర జలాలతో కరిగించి నిమజనం చేస్తామని చెప్పారు. బుదవారం ఉదయం 11 గంటలకు ఖైరతాబాద్‌ గణేష్ విగ్రహం తయారీపనులు మొదలుపెట్టినట్లు తెలిపారు.  


Related Post