ఓఎల్ఎక్స్ లో అమ్మకానికి యుద్ధవిమానం!

August 05, 2020
img

ఇంట్లో పాత వస్తువులను, వాహనాలను వదిలించుకోవడానికి చాలా మంది ఓఎల్ఎక్స్ లో పెడుతుంటారు. అయితే ఎవరో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఓ పాత యుద్ధవిమానాన్నే ఓఎల్ఎక్స్ లో అమ్మకానికి పెట్టేశాడు. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న ఆ యుద్ధవిమానాన్ని పాతదైపోవడంతో దానిని డీకమీషన్ చేసి ఉత్తరపరదేశ్‌లోని ఆలీఘర్ ముస్లిం యూనివర్సిటీకి 2009లో బహుమతిగా ఇచ్చింది. దానిని యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో ప్రదర్శనకు ఉంచారు. ఎవరో ఆకతాయి దాని ఫోటో తీసి ఓఎల్ఎక్స్ లో రూ.9.99 కోట్లకు అమ్మకానికి పెట్టేశాడు. ఇది గుర్తించిన ఓఎల్ఎక్స్ సంస్థ వెంటనే దానిని తమ వెబ్‌సైట్‌లో నుంచి తొలగించింది. 


Related Post