నేటి నుంచి అయోధ్యలో ప్రత్యేక పూజలు ప్రారంభం

August 03, 2020
img

ఈ నెల 5వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ అయోధ్యలో రామమందిరం నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేయనున్నారు. నేటి నుంచి అయోధ్యలో ప్రత్యేకపూజలు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా అన్ని నదుల నుంచి సేకరించి తెచ్చిన నీళ్లతో శ్రీ సీతారాముల విగ్రహాలకు అభిషేకాలు జరుపుతారు. భూమిపూజ చేసిన తరువాత దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి సేకరించి తెచ్చిన మట్టిని దానిలో వేసి శంఖుస్థాపన చేస్తారు. మూడున్నర ఏళ్ళ వ్యవధిలో రామమందిర నిర్మాణం పూర్తి చేయాలని రామ మందిరం ట్రస్ట్ భావిస్తోంది.    

ప్రధాని నరేంద్రమోడీ రామ మందిరం శంఖుస్థాపనకు వస్తుండటంతో పాకిస్థాన్‌ ప్రేరిత ఉగ్రవాదులు భారీ విధ్వంసానికి పాల్పడేందుకు కుట్రలు పన్నుతున్నట్లు నిఘావర్గాలు హెచ్చరికలు చేయడంతో అయోధ్యలో బారీగా భద్రతాదళాలు మోహరించి కట్టుదిట్టమైన భద్రతాఏర్పాట్లు చేస్తున్నారు.  


Related Post