నేడు రాఖీ పండుగ...శుభాకాంక్షలు

August 03, 2020
img

ప్రపంచానికి ఫాదర్స్ డే, మదర్స్ డే వంటివేవి తెలియనిరోజుల్లోనే భారతదేశంలో రాఖీ పండుగ జరుపుకొనేవారు. అన్నాచెల్లెళ్ళు…అక్కా తమ్ముళ్ళ మద్య ఉండే బలమైన బందాలకు చిహ్నంగా రాఖీపండుగ నిలుస్తుంది. ఈ పండుగ సందర్భంగా వయసుతో సంబంధం లేకుండా మహిళలు తమ అన్నదమ్ముల చేతికి రాఖీలు కట్టి వారిపట్ల తమ అనురాగాన్ని, అప్యాయతను చాటుకొంటారు. అక్కాచెల్లెళ్ళతో రాఖీలు కట్టించుకోవడం ద్వారా వారి కష్టసుఖాలలో జీవితాంతం తోడుగా ఉంటామనే భరోసా అన్నదమ్ములు కల్పిస్తారు. అందుకే ఈ పండుగకు 'రక్షా బందన్' అనే పేరుంది.  కాలక్రమంలో కుటుంబంలో బంధాలు బలహీనపడకుండా ఎప్పటికప్పుడు బలపరిచే పండుగే రాఖీ పండుగ అని చెప్పుకోవచ్చు. కుటుంబ బంధాలను బలపరిచే ఇటువంటి మరో గొప్ప పండుగ లేదంతే అతిశయోక్తి కాదు.

ఒకప్పుడు ఇది ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితమై ఉండేది. కానీ దక్షిణాది ప్రజలు ఉత్తరాది రాష్ట్రాలకు అదేవిదంగా ఉత్తరాది ప్రజలు దక్షిణాది రాష్ట్రాలకు వలసలు వెళ్ళిన తరువాత రాఖీ పండుగ ప్రాశస్త్యం అందరికీ తెలిసీఎండీ. దాంతో ఇప్పుడు అన్ని రాష్ట్రాలలో ప్రజలు రాఖీ పండుగ జరుపుకొంటున్నారు. దక్షిణాది రాష్ట్రాలలో రాఖీ పండు ఈ జంద్యాల పౌర్ణమిగా కూడా జరుపుకొంటుంటారు. రాఖీ పండుగ సందర్భంగా సోదరసోదరీమణులందరికీ మై తెలంగాణ.కామ్ శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

Related Post