హైదరాబాద్‌లో కరోనాతో కాంగ్రెస్‌ నేత మృతి

July 13, 2020
img

తెలంగాణ సీనియర్ కాంగ్రెస్‌ నేత జి.నరేందర్ యాదవ్ యాదవ్ కరోనాకు బలయ్యారు. కొన్ని రోజుల క్రితం ఆయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. వెంటనే హైదరాబాద్‌ యశోదా ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకొన్నప్పటికీ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చనిపోయారు. నగరంలో కరోనా మహమ్మారి ప్రవేశించినప్పటి నుంచి కరోనా బాధితుల కోసం సహాయ కార్యక్రమాలు చేయపడుతున్న ఆయన కరోనాకే బలైపోవడంతో కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు విచారంలో మునిగిపోయారు. 

అధికార, ప్రతిపక్షాల నేతలు, కార్యకర్తలు నిత్యం ప్రజల మద్య ఉండక తప్పదు. కనుక ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నప్పటికీ కరోనా బారినపడుతూనే ఉన్నారు. వి.హనుమంతరావు వంటి కొందరు సీనియర్లకు కూడా కరోనా సోకినప్పటికీ కోలుకొని ఇంటికి చేరుకొన్నారు. కానీ ఆయన కంటే వయసులో చిన్నవాడైన నరేందర్ కూడా కోలుకొని త్వరలోనే తిరిగివస్తాడని ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులకు, పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆయన చనిపోయారనే వార్త పెద్ద షాక్ అనే చెప్పవచ్చు. దీంతో రాజకీయనేతలు, కార్యకర్తలు పార్టీ కార్యక్రమాలలో పాల్గొనేందుకు జంకుతున్నారు.

Related Post