హైదరాబాద్‌లో గాలిని కూడా అమ్మేస్తున్నారు

July 11, 2020
img

హైదరాబాద్‌ నగరంలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో కరోనా రోగులకు ప్రనాధారమైన ఆక్సిజన్ సిలిండర్లకు విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. ఆసుపత్రులు ఎలాగూ ఆక్సిజన్ సిలెండర్లు వినియోగించుకొంటాయి. ఇప్పుడు ఉన్నత వర్గాలవారు కూడా ముందుజాగ్రత్త చర్యగా ఆక్సిజన్ సిలెండర్లు కొని ఇళ్ళలో నిలువచేస్తుండటంతో వాటికి డిమాండ్ పెరిగిపోయింది. దాంతో నగరంలో ఆక్సిజన్ సిలిండర్ల దందా మొదలైపోయింది. వాటిని బ్లాకులో అమ్ముతున్నట్లు కనిపెట్టిన వెస్ట్ జోన్ టాస్క్ పోలీసులు, శనివారం ఉదయం దాడులు చేసి రెండు ముఠాలను అరెస్ట్ చేసి వారివద్ద ఉన్న 34 ఆక్సిజన్ సిలెండర్లను స్వాధీనం చేసుకొని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖకు అప్పగించారు. ప్రాధమిక విచారణలో డిమాండును బట్టి ఒక్కో సిలెండర్ లక్ష రూపాయల వరకు అమ్మినట్లు కనుగొన్నారు. వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఎవరైనా అనుమతి లేకుండా ఆక్సిజన్ సిలెండర్లు బ్లాకులో అమ్మితే కటినచర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. 


Related Post