జనావాసాలపై కుప్పకూలిన విమానం

May 22, 2020
img

శుక్రవారం సాయంత్రం పాకిస్థాన్‌లో ఘోరవిమాన ప్రమాదం జరిగింది. లాహోర్ నుంచి కరాచీకి వస్తున్న పాకిస్తాన్ ఇంటెర్నేషనల్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఏ-320 విమానం ల్యాండింగ్‌కు సిద్దమవుతుండగా, మలీర్ అనే ప్రాంతంలో గల జనావాసాలపై కుప్పకూలిపోయింది. 

విమానంలో 99 మంది ప్రయాణికులతో పాటు 9 మంది విమాన సిబ్బంది కూడా ఉన్నారు. విమానం జనావాసాలపై కూలిపోవడంతో ఆ ప్రాంతంలో చాలా ఇళ్ళు క్షణంలో శిధిలాలుగా మారిపోయాయి. విమానంలో ఉన్నవారితో పాటు ఆ  ఇళ్ళలో ఉన్నవారు అనేకమంది చనిపోయి ఉండవచ్చు. ప్రమాదం సమాచారం అందగానే అగ్నిమాపక సిబ్బంది, వైద్య సిబ్బంది, అంబులెన్సులు, పోలీసులు, సహాయ బృందాలు అక్కడకు చేరుకొని గాయపడినవారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. శుక్రవారం కావడంతో పది నిమిషాల క్రితం వరకు జనలతో కళకళలాడిన ఆ ప్రాంతమంతా గాయపడినవారి రోదనలతో యుద్ధభూమిలా మారింది.

విమాన ప్రమాదానికి కారణం ఇంకా తెలియవలసి ఉంది. బహుశః సాంకేతిక లోపం అయ్యుండవచ్చని భావిస్తున్నారు. అయితే దీనిపై అప్పుడే ఏమీ చెప్పలేమని పాకిస్తాన్ ఎయిర్ పోర్ట్ ఆధారిటీ ప్రతినిధి అబ్దుల్ సత్తార్ చెప్పారు. 

పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌, పాక్‌ పౌర విమానయానశాఖ మంత్రి గులాం సర్వార్, దేశవిదేశాలకు చెందిన పలువు ప్రముఖులు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు సోషల్ మీడియా ద్వారా సానుభూతి తెలుపుతున్నారు. పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించారు.

Related Post