ముఖ్యమంత్రి సహాయనిధికి షిర్డీ సంస్థాన్ భారీ విరాళం

March 27, 2020
img

దేశంలోని ప్రసిద్ద దేవాలయాలలో మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయం కూడా ఒకటని అందరికీ తెలిసిందే. భక్తుల సంఖ్య, ఆదాయం విషయంలో తిరుమల శ్రీవారి ఆలయం తరువాత షిర్డీ బాబా ఆలయం 2వ స్థానంలో నిలుస్తోంది. నిరుపేదలకు, నిసహాయులకు సేవచేయడమే భగవంతుని సేవగా భావించాలని షిర్డీబాబా చెప్పేవారు. బాబా భోదనలను ఆచరణలో పెడుతూ షిర్డీ ఆలయాన్ని నిర్వహిస్తున్న షిర్డీ సంస్థాన్ గతంలో పుల్వామా ఉగ్రడాదిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు షిర్డీ సంస్థాన్ రూ.12 కోట్లు విరాళం అందజేసింది. మళ్ళీ ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.51 కోట్లు విరాళం ప్రకటించింది. షిర్డీ సంస్థాన్ ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అరుణ్ డోంగ్రే ఈవిషయం మీడియాకు తెలియజేశారు. మానవసేవే మాధవసేవ అని తాము నమ్ముతున్నామని కనుక కరోనా మహమ్మారిని ఎదుర్కొంటూ ప్రజలను కాపాడాటానికి కృషి చేస్తున్న మహారాష్ట్ర ప్రభుత్వానికి తాము అండగా ఉంటామని చెప్పారు.


Related Post