తిరుమలలో యధావిధిగా నిత్యకైంకర్యాలు

March 27, 2020
img

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు 128 సం.ల తరువాత తొలిసారిగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని మూసివేశారు. తిరుమల కొండపై ఉన్న ఉపాలయాలు, అలాగే కొండా విశ్వేశ్వర్ రెడ్డి దిగువన ఉన్న అన్ని ఆలయాలు కూడా మూసివేశారు. గ్రహణ సమయాలలో దేశంలో అన్ని ఆలయాలు మూసివేసినా శ్రీకాళహస్తి ఆలయం మాత్రం తెరిచే ఉంటుంది. కానీ మొదటిసారిగా కరోనా గ్రహణంలో ఆ ఆలయాన్ని కూడా మూసివేశారు. భక్తులను అనుమతించనప్పటికీ తిరుమలతో సహా రెండు తెలుగు రాష్ట్రాలలో అన్ని ఆలయాలలో అర్చకులు దూపదీపనైవేధ్యాలు, నిత్యపూజలు యధావిధిగా నిర్వహిస్తున్నారు.

తిరుమలలో స్వామివారికి నిత్యకైంకర్యాలు కూడా యధావిధిగా చేస్తున్నామని రమణదీక్షితులు తెలిపారు. తిరుమలలో వెలిగే అఖండదీపం గురించి సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని అన్నారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాతసేవ మొదలు రాత్రి ఏకాంతసేవ వరకు అఖండదీపం వెలుగుతూనే ఉంటుందని తెలిపారు. కరోనా మహమ్మారి నుంచి లోకాన్ని కాపాడమని అష్టదిక్పాలకులను ప్రార్ధిస్తూ గురువారం నుంచి తిరుమలలోని ధర్మగిరి వేదవిజ్ఞాన పీఠంలో ధన్వంతరి యాగం మొదలుపెట్టారు. ఈనెల 27,28 తేదీలలో ప్రత్యేక హోమాలు నిర్వహిస్తారు. ఈనెల 28న పూర్ణాహుతితో యాగం ముగుస్తుందని తెలిపారు.

Related Post