రెండు కోట్లు విరాళం ప్రకటించిన పవన్ కళ్యాణ్

March 26, 2020
img

దేశానికి... రాష్ట్రాలకు ఎటువంటి కష్టం వచ్చిన అందరికంటే ముందుగా విరాళాలు ప్రకటిస్తుంటారు మన సినీహీరోలు. ఇప్పుడు కూడా తెలుగు, తమిళ సినీ పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు కరోనాను ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి సహాయనిధులకు భారీగా విరాళాలు అందజేస్తున్నారు. 

ఇటువంటి కష్టకాలంలో ఎప్పుడూ ముందే పవన్‌ కల్యాణ్‌ ప్రధానమంత్రి సహాయనిధికి కోటి రూపాయలు, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధికి చెరో రూ.50 లక్షలు విరాళం ప్రకటించారు. 

రాంచరణ్ తేజ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ స్పూర్తితో ప్రధానమంత్రి సహాయనిధికి,ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధికి కలిపి మొత్తం రూ. 70 లక్షలు విరాళం ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు.   


రజనీకాంత్‌ దక్షిణాది సినీ కార్మికుల ఫెడరేషన్‌కు రూ.50 లక్షలు విరాళం ఇచ్చారు.   

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధికి చెరో రూ.10 లక్షలు విరాళం ప్రకటించారు.

దర్శకుడు కొరటాల శివ ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధికి చెరో రూ.5 లక్షలు విరాళం ప్రకటించారు. 

నితిన్ కూడా ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధికి చెరో రూ.10 లక్షలు విరాళం ప్రకటించారు.

సినిమా షూటింగులు పూర్తిగా నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేద సినీ కళాకారులను, ఇతర కార్మికులను ఆడుకోవడానికి దర్శకుడు వివి వినాయక్, నటుడు కాదంబరి కిరణ్ నేతృత్వంలో నడుస్తున్న ‘మనం సైతం’ ఫౌండేషన్ చెరో రూ.5 లక్షలు విరాళం ఇచ్చారు. నటుడు శివాజీరాజ కళాకారులకు 10 రోజులకు సరిపడే కూరగాయలు, నిత్యావసరసరుకులు అందజేశారు.         

కమల్ హాసన్ కరోనా రోగుల కోసం చెన్నైలోని తన ఇంటిని ఆసుపత్రికి ఉపయోగించుకొనేందుకు సంసిద్దత ప్రకటించారు.

బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధూఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధికి చెరో రూ.5 లక్షలు విరాళం ప్రకటించారు. 

ఇటువంటి క్లిష్ట సమయంలో మన సినీ పరిశ్రమకు చెందిన హీరోలు, దర్శకులు, నిర్మాతలు ముందో వెనకో తప్పకుండా ఉడతాభక్తిగా తమవంతు విరాళాలు ప్రకటిస్తుంటారు. కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మన తెలుగు సినీ పరిశ్రమలో కోట్లు సంపాదించుకొంటున్న మన 'ఇంపోర్టడ్డ్ హీరోయిన్లు మాత్రం పైసా విదిలించడానికి ఇష్టపడరు ఎందుకో?     

Related Post