పోలీసులను ఆశ్రయిస్తున్న హాస్టల్స్ విద్యార్దులు

March 25, 2020
img

నిన్న అర్దరాత్రి నుంచి 21 రోజులు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో హైదరాబాద్‌లోని బాలానగర్, అమీర్ పేట్, పంజగుట్ట తదితర ప్రాంతాలలో ఉండే హాస్టల్స్ లో ఉంటున్నవారిని ఖాళీ చేయాలని హాస్టల్స్ యజమానులు ఒత్తిడి చేస్తుండటంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దూర ప్రాంతాల నుంచి హాస్టల్స్ లో ఉంటున్న తమను ఇప్పటికిపుడు ఖాళీ చేసి పొమ్మంటే రైళ్లు, బస్సులు లేనప్పుడు ఎక్కడికి పోతామని ప్రశ్నిస్తున్నారు. అయినప్పటికీ హాస్టల్స్ ఖాళీ చేయాలని యజమానులు ఒత్తిడి చేస్తుండటంతో వారు సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లకు వెళ్ళి ఫిర్యాదు చేస్తున్నారు.

కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు 21 రోజులు లాక్‌డౌన్‌ ప్రకటించి ఇళ్ళలో నుంచి బయటకు రావద్దని ఆదేశించాయే తప్ప ఊళ్ళు వదిలి వెళ్లిపోవాలని ఆదేశించలేదు. కానీ లాక్‌డౌన్‌ కారణంగా నిత్యావసరసరుకులు, కూరగాయలు లభించడం కష్టంగా ఉంది కనుక హాస్టల్స్ లో ఉండేవారికి భోజనవసతి కల్పించలేమని చెపుతూ ఖాళీ చేయాలని హాస్టల్ యజమానులు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. హాస్టల్స్ ఉండేవారు ఎదుర్కొంటున్న ఈ సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి పోలీసులు కృషి చేస్తున్నారు.

Related Post