వేములవాడకు హెలికాఫ్టర్‌ సర్వీసులు

February 20, 2020
img

శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా హైదరాబాద్‌ నుంచి వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకొని రావడానికి హెలికాఫ్టర్‌ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈరోజు ఉదయం హైదరాబాద్‌ బేగంపేట విమానాశ్రయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ హెలికాఫ్టర్‌ సర్వీసులు లాంఛనంగా ప్రారంభించారు. నేటి నుంచి ఈనెల 23వరకు హెలికాఫ్టర్‌ సేవలు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్‌ నుంచి వేములవాడకు వెళ్ళిరావడానికి టికెట్ ధర రూ.30,000 గా నిర్ణయించినట్లు పర్యాటకశాఖ తెలియజేసింది. దీనికి సంబందించి పూర్తివివరాలు తెలంగాణ పర్యాటకశాఖ వెబ్‌సైట్‌లో లభిస్తాయి. దానిద్వారానే హెలికాఫ్టర్‌ టికెట్స్ కూడా బుక్‌ చేసుకోవచ్చు.   


Related Post