మధ్యాహ్నం పెళ్ళి...రాత్రి పెళ్ళికొడుకు మృతి!

February 15, 2020
img

నిజామాబాద్‌ జిల్లా బోధన్ పట్టణంలో శుక్రవారం ఒక పెళ్ళివారింట అనూహ్యమైన విషాదకర ఘటన జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం పట్టణంలో మంగళి గణేశ్ (25) అనే యువకుడి వివాహం జరిగింది. మధ్యాహ్నం బంధుమిత్రులందరితో కలిసి కొత్త దంపతులు విందుభోజనం చేశారు. రాత్రి బారాత్ కార్యక్రమంలో పాటలకు పెళ్ళికొడుకు బందుమిత్రులతో కలిసి చాలా సంతోషంగా...ఉత్సాహంగా నృత్యం చేశాడు. పెళ్ళికూతురు కూడా అతనితో ఉత్సాహంగా స్టెప్పులు వేసింది. కానీ అంతలోనే పెళ్ళికొడుకు కుప్పకూలిపోయాడు. వెంటనే బందుమిత్రులు అతనిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. అతనికి గుండెపోటు వచ్చినట్లు కనుగొన్న వైద్యులు అత్యవసర చికిత్స అందజేశారు. కానీ శనివారం తెల్లవారుజామున 2 గంటలకు గణేశ్ మరణించినట్లు వైద్యులు తెలియజేశారు. పెళ్ళైన కొన్ని గంటల వ్యవధిలోనే పెళ్ళికొడుకు చనిపోవడంతో పెళ్లికూతురుతో సహా ఇరుకుటుంబాల సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బారాత్ సమయంలో పరిమితికి మించి పెద్ద శబ్ధంతో డీజే సౌండ్ కారణంగానే పెళ్ళికొడుకు గణేశ్ ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. 


Related Post