త్వరలో పూర్తికానున్న యాదాద్రి నిర్మాణపనులు

February 13, 2020
img

కేసీఆర్‌ తెలంగాణ సిఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి స్వీయ పర్యవేక్షణలో యాదగిరిగుట్టను యాదాద్రిగా అద్భుతంగా తీర్చిదిద్దారు. యాదాద్రి ఆలయపునర్నిర్మాణ పనులు దాదాపు పూర్తికావచ్చాయి. ఈ నెలాఖరులోగా మిగిలిన చిన్నా చితకా పనులన్నీ కూడా పూర్తయిపోగానే మంచిరోజు చూసుకొని సిఎం కేసీఆర్‌ దంపతులు యాదాద్రిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి విగ్రహప్రతిష్ట చేస్తారు. ఆ తరువాత యాదాద్రి కొండపైనే మహా సుదర్శన యాగం చేస్తారు.

కొండపైన ఆలయం పరిసరాలతో పాటు కొండ దిగువనున్న ప్రాంతాలలో కూడా పచ్చదనంతో కళకళలాడేలా తీర్చిదిద్దారు. ఒకప్పుడు గతుకుల రోడ్లపై బస్సులో గుట్టకు వెళ్ళిరావడం భక్తులకు పెద్ద పరీక్షగా ఉండేది. కానీ ఇప్పుడు హైదరాబాద్‌ నుంచి యాదాద్రి వరకు విశాలమైన రోడ్లు, యాదాద్రికి నాలుగైదు కిమీ దూరం నుంచి రోడ్డుకు ఇరువైపులా పచ్చటి చెట్లతో చాలా హాయిగా, ఆహ్లాదంగా ప్రయాణం సాగుతుంది. కొండపై కూడా ఎక్కడికక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేసి పరిశుభ్రంగా నిర్వహిస్తుండటంతో నానాటికీ భక్తుల రద్దీ పెరుగుతోంది. యాదాద్రి ఆలయ నిర్మాణపనులు పూర్తయిపోతే భక్తుల రద్దీ పెరగడం ఖాయం. 

Related Post