షాద్‌నగర్‌లో చిరుతపులి!

January 21, 2020
img

హైదరాబాద్‌ శివారులోని షాద్‌నగర్‌లో సోమవారం తెల్లవారుజామున చిరుతపులి ప్రవేశించింది. పటేల్ రోడ్డులోని మన్నే విజయకుమార్ అనే వ్యక్తి ఇంటి డాబాపై పడుకొంది. తెల్లవారుజామున దాబాపైకి వెళ్లినప్పుడు దానిని చూసి వెంటనే ఆయన పోలీసులకు సమాచారం అందించారు. వారు జూ అధికారులకు సమాచారం అందించి వెంటనే అక్కడకు చేరుకొని ప్రజలను ఇళ్ళలో నుంచి బయటకు రావద్దంటూ అప్రమత్తం చేశారు. జూ సిబ్బంది దానికి మత్తుమందు ఇచ్చి పట్టుకొనే ప్రయత్నం చేశారు. కానీ అది భయపడి సమీపంలో ఉన్న ఓ పాడుబడిన ఇంట్లో ప్రవేశించి దాక్కొంది. అక్కడే మెల్లగా మత్తులోకి జారుకొన్నాక జూ సిబ్బంది దానిని బందించి జూకు తరలించారు. నగరాలు నలువైపులా విస్తరిస్తున్నప్పుడు వన్యప్రాణులకు ఆవాసం, ఆహారం లభించవు కనుక అవి నగరంలోకి చొరపడుతుండటం సహజమే. హైదరాబాద్‌లో కూడా అదే జరిగిందని చెప్పవచ్చు. అందుకే సిఎం కేసీఆర్‌ రాష్ట్రమంతటా హరితహారం పధకం క్రింద కోట్లాది చెట్లు నాటిస్తున్నారు. 


Related Post