షిర్డీ సాయి ఆలయం మూసివేయడం లేదు

January 18, 2020
img

షిర్డీలోని సాయిబాబా ఆలయాన్ని రేపటి నుంచి మూసివేస్తున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలను షిర్డీ సంస్థాన్ ఖండించింది. అటువంటి ఆలోచన కూడా చేయలేదని, షిర్డీసాయి ఆలయంలో యధాప్రకారం భక్తుల దర్శనాలు కొనసాగిస్తామని, ఆన్‌లైన్‌ ద్వారా దర్శనం, రూముల బుకింగ్ కూడా యధాప్రకారం కొనసాగిస్తామని షిర్డీ సంస్థాన్ తెలియజేసింది. అయితే సాయిబాబా జన్మస్థలంగా భావించబడుతున్న మహారాష్ట్రలో పత్రిలో షిర్డీ బాబా ఆలయానికి  ప్రత్యామ్నాయంగా మరో ఆలయాన్ని నిర్మించాలనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే ప్రతిపాదనకు నిరసనగా షిర్డీలో ప్రజలు ఆందోళనలు చేపట్టబోతున్నారని షిర్డీ సంస్థాన్ సభ్యులు తెలిపారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం షిర్డీ పట్టణంలో బంద్ నిర్వహించనున్నారని తెలిపారు. దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి వచ్చే షిర్డీ భక్తులకు రేపు జరుగబోయే బంద్‌ సందర్భంగా ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నామని షిర్డీ సంస్థాన్ సభ్యులు తెలిపారు.

Related Post