బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదం కేసు వాయిదా

December 12, 2019
img

బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ కారు ప్రమాదానికి కారకుడైన కృష్ణ మిలన్‌రావుకు హైకోర్టు ఇచ్చిన గడువు నేటితో ముగియడంతో మళ్ళీ ఆయన హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దానిపై నేడు విచారణ జరిపిన హైకోర్టు ఈ కేసును    జనవరి 3కు వాయిదా వేసింది. అతను నిర్లక్ష్యంగా అతివేగంతో నడపడం వలననే ఒక మహిళ చనిపోయిందని, మరో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారని కనుక చట్ట ప్రకారం అతనికి శిక్ష విధించాలని, అందుకే సెక్షన్ 304(2) కింద కేసు నమోదు చేశామని పోలీసుల తరపు న్యాయవాది వాదించారు. కానీ ఈ ప్రమాదంలో నిందితుడు కూడా తీవ్రంగా గాయపడినందున, జనవరి 3వరకు అరెస్ట్ చేయరాదని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. 

గత నెల 23న కృష్ణ మిలన్‌రావు బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై గంటకు 108 కిమీ వేగంతో దూసుకువెళుతున్నప్పుడు మలుపు వద్ద వాహనం అదుపు తప్పి పల్టీలు కొట్టి ఫ్లైఓవర్ నుంచి క్రింద పడింది. ఆ సమయంలో అక్కడే బస్సు కోసం ఎదురుచూస్తున్న సత్యవతి (56) అనే మహిళపై కారు పడటంతో ఆమె ఘటనాస్థలంలోనే చనిపోయింది. బాలరాజ్ నాయక్, కుబ్రా, ప్రణీత అనే ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.

Related Post