గోదావరి జలాలతో సిరిసిల్ల కళకళ

December 11, 2019
img

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మిడ్‌మానేరును గోదావరి జలాలతో నింపడంతో సిరిసిల్ల పట్టణం ఒడ్డున గల సిరిసిల్ల మానేరువాగులో కూడా (బ్యాక్ వాటర్స్) నీళ్ళు నిండాయి. దాంతో ఎన్నడూ లేనివిధంగా సిరిసిల్ల పట్టణం కొత్త సొగసులు సంతరించుకొని కళకళలాడుతోంది. సిరిసిల్ల ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్‌ ఈ దృశ్యం చూసి పులకించిపోయి, ఆ ఫోటోలను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 



“సిరిసిల్ల జలకళను సంతరించుకున్న తరుణంలో గోదారమ్మ పరవళ్ళతో రైతుల కళ్ళలో చెరగని సంతోషం నిండింది. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చేందుకు వేసిన జలబాటలు.. శ్రీ రాజరాజేశ్వరి ప్రాజెక్టు బ్యాక్ వాటర్. సిరిసిల్ల ఎమ్మెల్యేగా గర్వపడుతున్నా,” అంటూ మెసేజ్ పెట్టారు. 

ఈ ఫోటోలను చూస్తుంటేనే కడుపు నిండిపోతోంది. ఇక సిరిసిల్లలో నివసిస్తున్న ప్రజలు, ముఖ్యంగా రైతులు ఎంత సంతోషపడుతున్నారో ఊహించుకోవచ్చు. తెలంగాణ ఏర్పాటుకు ప్రదాన కారణాలలో ఒకటైన ‘నీళ్ళు’ ఇప్పుడు రాష్ట్రంలో చాలా ప్రాంతాలకు గలగల పారుతున్నాయి. తెరాస సర్కార్‌ చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తయితే రాష్ట్రమంతటా సిరిసిల్ల పట్టణంలాగే జలకళతో ఉట్టిపడతాయి.

Related Post