ప్రియాంకా రెడ్డి కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు

December 02, 2019
img

పశువైద్యురాలు ప్రియాంకా రెడ్డి కేసుకు పోలీసులు ‘జస్టిస్ ఫర్ దిశ’ అనే పేరుతో శరవేగంగా దర్యాప్తు పూర్తి చేశారు. ఆమె హత్యపై వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేసి దోషులకు కటినమైన శిక్షలు విధించేందుకుగాను ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని నిశ్చయించింది. ఈ మేరకు సిఎం కేసీఆర్‌ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఆదేశించడంతో, ఆయన ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు తక్షణం చర్యలు చేపట్టారు. హైకోర్టు అనుమతి లభించగానే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని న్యాయశాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి తెలిపారు. జస్టిస్ ఫర్ దిశ’ కేసులో రాష్ట్రానికి చెందిన న్యాయవాదులు ఎవరూ నిందితుల తరపున వాదించకూడదని నిర్ణయించుకొన్నారు. పోలీసులు ఇప్పటికే ఈ కేసుకు సంబందించి అన్ని కీలక సాక్ష్యాధారాలను సేకరించి వాటిని కోర్టులో శాస్త్రీయంగా నిరూపించేందుకు సిద్దంగా ఉన్నారు.  కనుక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటయితే ఈ కేసు విచారణ త్వరగానే ముగిసి దోషులకు శిక్షలు విధించబడే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Related Post