యాదాద్రిలో వైకుంఠ ద్వారం తొలగింపు

November 16, 2019
img

యాదాద్రి ఆలయం పునర్నిర్మాణంలో భాగంగా కొండ దిగువన కొత్త సింహద్వారం (గాలిగోపురం) నిర్మాణం దాదాపు పూర్తయినందున దానికి దిగున ఉన్న శ్రీ వైకుంఠ ద్వారాన్ని శుక్రవారం రాత్రి తొలగించారు. దానిని 1947లో అప్పటి ఆలయకమిటీ సభ్యులు సీతారామయ్య శాస్త్రి, రామ్ దయాళ్ షేక్ నిర్మించారు. అది శిధిలావస్థకు చేరుకోవడంతో దాని స్థానంలో కాస్త ఎగువన కృష్ణశిలతో కొత్త సింహద్వారం నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలోగా యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తి చేసి ఫిబ్రవరిలో కొండపై మహా సుదర్శనయాగం నిర్వహించాలని సిఎం కేసీఆర్‌ భావిస్తునందున ఆలయ నిర్మాణ, సుందరీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వాటిలో భాగంగానే పాత సింహద్వారాన్ని తొలగించారు.

       


Related Post