టీఎస్‌ఆర్టీసీకి గుండెపోటు!

November 14, 2019
img

ఆర్టీసీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 41 రోజులుగా సమ్మె జరుగుతోంది కానీ ప్రభుత్వం చర్చలకు అయిష్టత కంబరుస్తున్నందున సమ్మె ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించడం లేదు. దీంతో ఆర్టీసీ కార్మికులలో రోజురోజుకూ ఆందోళన, నిరాశనిస్పృహలు పెరిగిపోతున్నాయి. ఆ కారణంగా టీఎస్‌ఆర్టీసీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అనేకమంది ఆర్టీసీ కార్మికులకు గుండెపోటుకు గురవుతున్నారు. 

తాజాగా హైదరాబాద్‌ మంథని డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న సమ్మయ్యకు గురువారం ఉదయం గుండెపోటు వచ్చింది. వెంటనే ఆర్టీసీ కార్మికులు అతనిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. సమ్మయ్య స్వస్థలం పెద్దపల్లి జిల్లాలోని ఖమ్మంపల్లి మండలంలోని సీతంపల్లి గ్రామం. 

మహబూబాబాద్‌లో ఆర్టీసీ శ్రామిక్ ఆత్మహత్యాయత్నం

 మహబూబాబాద్‌ డిపోకు చెందిన ఆవుల నరేశ్ అనే ఆర్టీసీ డ్రైవర్ చనిపోవడంతో జిల్లాలోని ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన అంత్యక్రియలు ముగిసిన కొద్ది గంటలకే జిల్లాలో తొర్రూర్ డిపోలో ఆర్టీసీ శ్రామిక్‌గా పనిచేస్తున్న మేకల అశోక్ పురుగుల మందు త్రాగి ఆత్మహత్యాయత్నం చేశారు. కుటుంబ సభ్యులు అతనిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.

Related Post