గురువారం హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

September 11, 2019
img

గురువారం హైదరాబాద్‌ నగరంలో గణేశ్ నిమజ్జనం జరుగనున్నందున ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ అధనపు కమీషనర్ అనిల్ కుమార్ తెలిపారు. నగరం నలువైపుల నుంచి భారీ ఊరేగింపులతో నిమజ్జనోత్సవాలు ఉంటాయి కనుక రేపు ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. కనుక రేపు ఒకరోజు నగరంలో ప్రజలందరూ సొంత వాహనాలను ఇంట్లోనే వదిలి, మెట్రో రైళ్ళను ఉపయోగించుకోవడం మంచిదని సూచించారు. ట్రాఫిక్ మళ్లించే ప్రాంతాలు, పార్కింగ్ కోసం కేటాయించిన ప్రాంతాలు:

హైదరాబాద్‌ తూర్పు ప్రాంతాలు:  చంచల్‌గూడ జైల్‌ క్రాస్‌ రోడ్స్‌, మూసారాంబాగ్‌, చాదర్‌ఘాట్‌ బ్రిడ్జి, శివాజీ బ్రిడ్జి, అఫ్జల్‌గంజ్‌, పుత్లీబౌలి క్రాస్‌రోడ్స్‌, ట్రూప్‌బజార్‌, జాంబాగ్‌ క్రాస్‌రోడ్స్‌, ఆంధ్రాబ్యాంక్‌ కోఠి.

హైదరాబాద్‌ పశ్చిమ ప్రాంతాలు: తోప్‌ఖానా మసీదు, అలస్కా జంక్షన్‌, ఉస్మాన్‌గంజ్‌, శంకర్‌బాగ్‌, సీనా హోటల్‌, అజంతాగేట్‌, ఆబ్కారీ లేన్‌, తాజ్‌ ఐలాండ్‌, బర్తన్‌ బజార్‌, ఏఆర్‌ పెట్రోల్‌ పంప్‌, కేఏకే బిల్డింగ్‌.

హైదరాబాద్‌ ఉత్తర ప్రాంతాలు: కర్బలామెదాన్‌ నుంచి  నెక్లెస్ రోడ్‌, అప్పర్‌ ట్యాంక్‌బండ్‌, బుద్ధభవన్‌, సెయిలింగ్‌క్లబ్‌, నల్లగుట్ట జంక్షన్‌, సీటీఓ, వైఎంసీఏ, ప్యారడైజ్‌ క్రాస్‌రోడ్స్‌, ప్యాట్నీ క్రాస్‌రోడ్స్‌, బాటా ఎక్స్‌ రోడ్స్‌, అడవయ్య క్రాస్‌రోడ్స్‌, ఘాంస్‌మండి క్రాస్‌రోడ్స్‌.

హైదరాబాద్‌ దక్షిణ ప్రాంతాలు: మహబూబ్‌నగర్‌ క్రాస్‌రోడ్స్‌, ఇంజన్‌బౌలి, కేశవగిరి, మదీనా క్రాస్ రోడ్స్‌, దారుల్‌ షిఫా క్రాస్‌ రోడ్స్‌, అస్రా ఆస్పత్రి, నాగుల్‌చింత, హిమ్మత్‌పురా, హరిబౌలి, మొగల్‌పురా, లక్కడ్‌కోట్‌, ఎంజే బ్రిడ్జ్‌, సిటీ కాలేజ్‌.

హైదరాబాద్‌ మధ్య ప్రాంతాలు: చాపెల్‌రోడ్‌ ఎంట్రీ, గద్వాల్‌ సెంటర్‌, షాలిమార్‌ థియేటర్‌, గన్‌ఫౌండ్రీ, స్కైలైన్‌ రోడ్‌ ఎంట్రీ, దోమల్‌గూడ, కంట్రోల్‌రూం, కళాంజలి, లిబర్టీ జంక్షన్‌, ఎంసీహెచ్‌ ఆఫీస్‌ వై జంక్షన్‌, బీఆర్కే భవన్‌ జంక్షన్‌, ఇక్బాల్‌ మినార్‌, రవీంద్రభారతి, ద్వారకా హోటల్‌ జంక్షన్‌, ఖైరతాబాద్‌ జంక్షన్‌, చిల్డ్రన్స్‌ పార్క్‌, మారియట్‌ హోటల్‌ జంక్షన్‌, కవాడిగూడ, ముషీరాబాద్‌ క్రాస్‌రోడ్స్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌, కట్టమైసమ్మ టెంపుల్‌ (లోయర్‌ ట్యాంక్‌బండ్‌), ఇందిరాపార్కు జంక్షన్‌.

పార్కింగ్ కోసం కేటాయించిన ప్రాంతాలు: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌, (ఖైరతాబాద్‌ జంక్షన్‌), ఎంఎంటీఎస్‌ స్టేషన్‌, (ఖైరతాబాద్‌), ఆనంద్‌నగర్‌ కాలనీ నుంచి రంగారెడ్డి జిల్లా పరిషత్‌ కార్యాలయం వరకు, బుద్ధభవన్‌ వెనక వైపు,  గోసేవా సదన్‌, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, కట్టమైసమ్మ టెంపుల్‌, ఎన్‌టీఆర్‌ స్టేడియం, నిజాం కాలేజ్‌, పబ్లిక్‌ గార్డెన్స్‌. 

రేపు ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు నగరంలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే అనుమతించబడతాయి కనుక దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు ముందుగానే తగిన ఏర్పాట్లు చేసుకొని రావలసిందిగా ట్రాఫిక్ అధనపు కమీషనర్ అనిల్ కుమార్ కోరారు.  


Related Post