అంత్యక్రియలకు డబ్బు లేదు అందుకే...

August 13, 2019
img

సమాజంలో మానవత్వం నానాటికీ ఏవిధంగా దిగజారుతోందో పట్టి చూపే సంఘటనలు కళ్ళ ముందే జరుగుతుంటే ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. ఇటీవల వరంగల్‌లో తల్లి పొత్తిళ్ళలో నిద్రిస్తున్న 9 నెలల చిన్నారిని ఎత్తుకుపోయి అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన అందుకు ఒక ఉదాహరణగా కనిపిస్తోంది. తాజాగా తమిళనాడులో ముత్తు లక్ష్మణన్‌ అనే వ్యక్తి అనారోగ్యంతో చనిపోయిన తన తల్లికి అంత్యక్రియలు చేసేందుకు తన వద్ద డబ్బు లేదని చెపుతూ తల్లి శవాన్ని రోడ్డు పక్కన చెత్తకుండీలో పడేసి చేతులు దులుపుకొన్నాడు. అతను స్థానిక ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నాడు. నిత్యం దైవార్చన చేసే వ్యక్తికి దైవంతో సమానమైన తల్లికి అంత్యక్రియలు చేయాలనే స్పృహ లేకపోవడం చూసి స్థానికులు దిగ్బ్రాంతి చెందారు.     

ఈ ఘటన తూత్తుకూడి జిల్లా ధనసింగ్ నగర్‌లో సోమవారం జరిగింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం వారు వచ్చి ఆమె శవాన్ని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ముత్తు లక్ష్మణన్‌ను అదుపులో తీసుకొని ప్రశ్నించగా అంత్యక్రియలు చేయడానికి తన వద్ద డబ్బు లేకపోవడం వలననే తల్లి శవాన్ని చెత్తకుండీలో పడేశానని చెప్పడంతో పోలీసులు కూడా షాక్ అయ్యారు. 

Related Post