భాగ్యనగరంలో భారీ వర్షం

May 22, 2019
img

మండువేసవిలో తీవ్ర ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల అల్లాడిపోతున్న భాగ్యనగరవాసులు మంగళవారం సాయంత్రం హటాత్తుగా కురిసిన భారీ వర్షంతో చాలా ఊరట పొందారు. నిన్న సాయంత్రం నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, కూకట్‌పల్లి, గచ్చిబౌలీ, మాదాపూర్, ఆల్వాల్, తిరుమలగిరి, బొల్లారం తదితర ప్రాంతాలలో చాలా భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా రోడ్లపై నీళ్ళు చేరడంతో ఆఫీసుల నుంచి ఇళ్లకు బయలుదేరిన ఉద్యోగులు రోడ్లపై ట్రాఫిక్ లో చిక్కుకొని చాలా ఇబ్బంది పడ్డారు. నగరంలో కొన్ని ప్రాంతాలలో భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు కూడా వీచడంతో ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రజలు కాస్త ఇబ్బందిపడ్డారు. భారీవర్షం పడటంతో నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది కానీ నేడు యధాప్రకారం తీవ్ర ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు తప్పకపోవచ్చు. 


Related Post