శ్రావణి కుటుంబం ఆమరణ నిరాహార దీక్ష

May 16, 2019
img

యాదాద్రి భువనగిరిజిల్లా, బొమ్మలరామారం మండలంలోని హాజీపూర్‌లో వరుస హత్య, అత్యాచారాలకు పాల్పడిన శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష విధించాలని కోరుతూ శ్రావణి తల్లితండ్రులు గురువారం మధ్యాహ్నం నుంచి బొమ్మల రామారం మండల కేంద్రంలో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోన్నారు. ఈ మూడు కేసుల విచారణ కోసం తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి శ్రీనివాస్ రెడ్డికి శిక్షను ఖరారు చేయాలని వారు కోరుతున్నారు. లేకుంటే ఇంత తీవ్రమైన కేసు కూడా తరువాత మెల్లగా అటకెక్కిపోతుందని, నేరస్థుడు మళ్ళీ బెయిల్‌పై విడుదలయ్యి బయటకు వస్తే రాష్ట్రంలో బాలికల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుందని వారు వాదిస్తున్నారు. హాజీపూర్‌ గ్రామస్తులతో పాటు మండలంలో గ్రామాల ప్రజలందరూ కూడా శ్రీనివాస్ రెడ్డికి తక్షణమే శిక్ష ఖరారు చేయెలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలో ముగ్గురు ఆడపిల్లలు హత్యకు గురవడంతో ఇప్పుడు గ్రామంలో ఎవరూ తమ పిల్లలను 3 కిమీ దూరంలో ఉన్న బొమ్మలరామారంలోని పాఠశాలకు పంపించడానికి భయపడుతున్నారని శ్రావణి తల్లితండ్రులు చెపుతున్నారు. 

 శ్రావణి తల్లితండ్రులు కోరుతున్నట్లుగా శ్రీనివాస్ రెడ్డికి చట్ట ప్రకారం కటినశిక్ష పడవలసిందే కానీ అది పూర్తికావడానికి సుదీర్గ న్యాయ ప్రక్రియ అనివార్యం కనుక ఇప్పటికిప్పుడు అతనికి న్యాయస్థానం ఉరిశిక్ష విధించి అమలుచేయలేదు. కానీ అన్ని కేసులలాగే ఇదీ అటకెక్కుతుందనే శ్రావణి తల్లితండ్రుల భయాలను కూడా కాదనలేము కనుక వీలైనంత త్వరగా ఈ కేసు విచారణ పూర్తిచేసి శ్రీనివాస్ రెడ్డిని శిక్షిస్తే న్యాయస్థానాలపై ప్రజలకు నమ్మకం, అటువంటి నేరస్తులకు భయం ఏర్పడుతుంది.

Related Post