బల్కంపేట అమ్మవార్లకు నీతా అంబానీ పూజలు

May 13, 2019
img

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అర్ధాంగి నీతా అంబానీ ఆదివారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్- ముంబయి ఇండియన్స్ మద్య జరిగిన ఫైనల్ మ్యాచ్ చూసేందుకు హైదరాబాద్‌ వచ్చారు. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఆమె మ్యాచ్ మద్యలో బల్కంపేటలో ఎల్లమ్మ ఆలయానికి వెళ్ళి అమ్మవార్లను దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం విశేషం. గతంలో కూడా ఆమె మూడుసార్లు ఎల్లమ్మ ఆలయ దర్శనానికి వచ్చారు. చిరకాలంగా నగరంలో ఉంటున్నవారిలో చాలా మంది బల్కంపేటలోని ఎల్లమ్మ, పోచమ్మ ఆలయానికి వెళ్ళి ఉండరు కానీ ముంబై నుంచి వచ్చిన నీతా అంబానీ ఆలయ ప్రాశస్త్యం తెలుసుకొని వచ్చి అమ్మవార్లను దర్శనం చేసుకోవడం విశేషమే. అనంతరం ఆమె ఆలయం ఆవరణలోనే ఉన్న నాగదేవత,  పోచమ్మ ఆలయాలను కూడా దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఆమె పూజలు ఫలించాయో ఏమో, ఆదివారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఆమె సహాధ్యక్షురాలిగా ఉన్న ముంబై ఇండియన్స్ టీమ్ విజయం సాధించి కప్పు గెలుచుకొంది.


Related Post