నీళ్ళ కోసం నిర్మల్ రైతులు ధర్నా

April 16, 2019
img

తెలంగాణ ప్రభుత్వం గత సాగునీటి ప్రాజెక్టుల ద్వారా రైతులకు సాగునీటిని, మిషన్ భగీరధ పధకం ద్వారా ప్రతీ ఇంటికీ త్రాగునీటిని అందజేయడానికి గత 5 ఏళ్లుగా నిరంతరంగా కృషి చేస్తోంది. కానీ నేటికీ అనేక జిల్లాలో సాగునీటికి, త్రాగునీటికి ప్రజలు కటకటలాడుతూనే ఉన్నారు. ఈసారి మార్చి నెల ప్రారంభం కాక ముందే ఎండలు మండిపోతుండటంతో నీటి అవసరం మరింత పెరిగింది. 

నిర్మల్ జిల్లాలో ధని గ్రామంలోని రైతన్నలు సమీపంలోగల వెంకన్న కుంట కింద వరి సాగు చేస్తుంటారు. ఈసారి కూడా   వరిపంట వేశారు. కానీ ఈసారి వెంకన్నకుంటలో నీళ్ళు ఎండిపోవడంతో వారి కళ్ల ముందే పంటలు ఎండిపోతుండటంతో రైతులందరూ కూడబలుక్కొని సోమవారం ఉదయం సారంగాపూర్ రహదారిపై బైటాయించి రాస్తారోకో చేశారు. తక్షణమే స్వర్ణ ప్రాజెక్టు నుంచి వెంకన్న కుంటకు నీరు విడుదల చేసి తమ పంటలను కాపాడాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకొన్న అధికారులు,  పోలీసులు అక్కడకు చేరుకొని 48 గంటలలో నీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చి వారిని శాంతింపజేశారు. ఒకవేళ అధికారులు మాట తప్పితే ఈసారి సాగునీరు విడుదల చేసేవరకు భార్యాపిల్లలతో రోడ్లపైనే బైటాయిస్తామని హెచ్చరించారు. 


Related Post