కోదాడలో మృత్యుఘోష

April 15, 2019
img

నిన్న శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్రమంతటా పండుగ వాతావరణం నెలకొని ఉండగా సూర్యాపేటజిల్లాలోని కోదాడలో నడిరోడ్డుపై మృత్యుఘోషతో దద్దరిల్లింది. శ్రీరామనవమి రోజున కోదాడకు 2 కిమీ దూరంలో ఉన్న తమ్మర శ్రీ సీతారామచంద్రస్వామివారిని దర్శించుకొందామని కోదాడకు చెందిన 10 మంది ఆటో చేయించుకొని వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కోదాడ-ఖమ్మం ప్రధానరహదారిలో ఖమ్మం క్రాస్ రోడ్డు వద్ద వారు ప్రయాణిస్తున్న ఆటో ముందున్న మరో ఆటోను ఓవర్ టేక్ చేయబోతుంటే ఎదురుగా సిమెంటు లోడుతో వస్తున్న లారీ వచ్చి ఆటోను డ్డీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మహిళలకు అక్కడికక్కడే చనిపోగా, మరో ఇద్దరు కోదాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మిగిలిన ఇద్దరి పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉండటంతో వారికి ప్రధమచికిత్స చేసి హైదరాబాద్‌ తరలించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు ఈ ప్రమాదంలో స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. విషయం తెలుసుకొన్న పోలీసులు, స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ హుటాహుటిన అక్కడకు చేరుకొని సహాయచర్యలు చేపట్టారు. 

మృతుల వివరాలు: అంబటి సైదమ్మ (38), వట్టికొండ శైలజ (40), నర్మినేని సుగుణ (45), గుండపనేని పద్మ (50), బేతు నాగమణి (60), బేతు లక్ష్మయ్య (65), ఆటో డ్రైవర్ ఎస్కే అబ్బాస్ (48). 


Related Post