మధులిక హెల్త్ బులెటిన్

February 20, 2019
img

ప్రేమోన్మాది చేతిలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయస్థితిలో మలక్ పేట యశోదా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న మధులిక మెల్లమెల్లగా కొలుకోంటోది. ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఉన్నందున ఇన్ని రోజులు ఆమెను ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోనే ఉంచి చికిత్స అందించారు. కానీ ఆమె ఇప్పుడు కోలుకోవడంతో ఐసీయూ నుంచి ఐసీయూ స్టెప్‌డౌన్‌ గదిలోకి మార్చినట్లు వైద్యులు తెలిపారు. అయితే నేటికీ ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఉందని కనుక ఆమెను కంటికి రెప్పలా కాపాడుకొంటున్నామని తెలిపారు. 

ఆసుపత్రిలో చేరినప్పుడు ఆమె పరిస్థితి చూసినప్పుడు బ్రతుకుతుందా? అని అందరూ భయపడ్డారు. కానీ యశోదా ఆసుపత్రి వైద్యుల నైపుణ్యం, నిరంతర శ్రమ కారణంగా ఆమె ప్రాణాలు నిలిచాయి. ఇది ఆమెకు పునర్జన్మవంటిదేనని చెప్పవచ్చు. అందుకు యశోదా ఆసుపత్రి వైద్యులను అభినందించవలసిందే. త్వరలో ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది.

Related Post