మరో సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జీహెచ్‌ఎంసీ

February 13, 2019
img

హైదరాబాద్‌ మహానగర పాలకసంస్థ (జీహెచ్‌ఎంసీ) ఇప్పటికే నగరంలో 121 అన్నపూర్ణా క్యాంటీన్లు నిర్వహిస్తోంది. కేవలం రూ.5కే వేడివేడిగా రుచికరమైన భోజనం అందిస్తూ పేదప్రజలు, విద్యార్ధులు, నిరుద్యోగుల కడుపులు నింపుతోంది. తాజాగా  ‘ఫీడ్ ది నీడ్’ పేరుతో జీహెచ్‌ఎంసీ మరో సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో నగరంలోని కొన్ని హోటల్స్ అసోసియేషన్, కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ)లను భాగస్వాములుగా చేసి పండుగలు, ప్రత్యేక దినాలలో నగరంలోని పేదలకు ఆహారపొట్లాలు అందించాలని నిర్ణయించింది. 

రేపు గురువారం వాలంటైన్స్ డే సందర్భంగా హైదరాబాద్‌ నగరంలో బస్టాండ్లు, ఆటో స్టాండ్లు, మురికివాడలు, నైట్ షెల్టర్లు, ప్రభుత్వాసుపత్రుల వద్ద 40,000 ఆహార పొట్లాలు పంపిణీ చేయబోతోంది. ఇక నుంచి తరచూ ఈ ఆహార వితరణ కార్యక్రమం  చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. 

నగరంలోని పిస్తా హౌస్, డీవి మనోహర్ హోటల్స్, ఇంకా అనేక చిన్నా పెద్ద హోటల్స్ ఆహారపొట్లాలు అందజేయడానికి ముందుకువచ్చాయి. వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు, కాలనీ సంఘాలు, అపార్ట్మెంట్ సంఘాలు కూడా ఈ ‘ఫుడ్ ఫర్ ది నీడ్’ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఆసక్తి కలిగినవారు 95421 88884(రజనీకాంత్), 96668 63435(విశాల్ ), 98499 99018 (పవన్) లను సంప్రదించవచ్చు. 

Related Post