మెట్రో లిఫ్టులో ముద్దూముచ్చట్లు

February 08, 2019
img

ఒకప్పుడు ప్రేమలు పెళ్ళిళ్ళు అంటేనే అందరూ విడ్డూరంగా చెప్పుకొనేవారు. ఇప్పుడు అవి కామన్ అయిపోయాయి. కేవలం ప్రేమ వరకే అయితే పరువాలేదు కానీ ప్రేమ పేరుతో యువజంటలు పార్కులు, సినిమాహాళ్ళు, పర్యాటక ప్రదేశాలలో బహిరంగ శృంగారానికి కూడా వెనుకాడటం లేదు. ఇక మెట్రో లిఫ్టులో ఏకాంతం లభిస్తే ఊరుకొంటారా? హైదరాబాద్‌ ఒక మెట్రో స్టేషన్లో ఏర్పాటు చేసిన లిఫ్టులో ఒక యువజంట ముద్దూముచ్చట్లలో మునిగిపోవడం లిఫ్టులో అమర్చిన సిసి కెమెరాలలో రికార్డ్ అయ్యింది. ఆ వీడియో క్లిప్పింగ్ ఉప్పల్ లోని కమాండ్ కంట్రోల్ సెంటరుకు చేరింది. అక్కడి నుంచి మీడియాకు, సోషల్ మీడియాకు ఏవిధంగా లీక్ అయ్యిందో తెలియదు కానీ అది వైరల్ అయ్యింది.

లిఫ్టులో సిసి కెమెరా ఉందని తెలిసి ఉన్నప్పటికీ ముద్దులు పెట్టుకోవడం చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఆ జంటలోని యువతే అబ్బాయిని గట్టిగా కౌగలించుకొని ముద్దు పెట్టుకొంటున్నట్లు వీడియోలో స్పష్టంగా కనబడుతోంది. దీనిపై అప్పుడే సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వస్తున్నాయి. సిసి కెమెరాల నుంచి వచ్చిన ఆ సమాచారం ఆధారంగా ఈ శృంగారం ఏ స్టేషన్లో జరిగిందో గుర్తించి తగిన చర్యలు చేపడతామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో స్టేషన్లలో హుందాగా వ్యవహరించవలసిందిగా కోరుతూ బోర్డులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 

Related Post