మానవత్వామా...ఎక్కడున్నావు?

January 17, 2019
img

కొన్ని సంఘటనలు చూస్తున్నప్పుడు ఈ ప్రపంచంలో మానవత్వం ఉందా లేదా? అనే అనుమానం కలుగకమానదు. ఒడిశా రాష్ట్రంలో ఝార్సీగూడ జిల్లాలోని కార్పబహాల్ అనే గ్రామంలో జానకి అనే ఒక నిరుపేద వితంతువు తన 17 ఏళ్ళ కొడుకుతో కలిసి నివసిస్తోంది. ఆమె ప్రమాదవశాత్తు నిన్న మృతి చెందింది. తల్లి చనిపోవడంతో ఏమి చేయాలో పాలుపోక ఆ బాలుడు గ్రామస్తులను సహాయం కోసం అర్ధించాడు. కానీ గ్రామంలో ఎవరూ అతని తల్లి దహన సంస్కారం చేయడానికి ముందుకు రాలేదు. అప్పుడు అతను తన తల్లి శవాన్ని చాపలో చుట్టి సైకిలుపై పెట్టుకొని వెళుతుంటే గ్రామంలో అందరూ చూస్తుండిపోయారు తప్ప ఎవరూ అతనికి సహాయపడేందుకు ముందుకు రాలేదు. అతను ఊరవతల అడవిలో గొయ్యి తీసి తల్లి శవాన్ని పూడ్చిపెట్టాడు. 


Related Post