సద్దుల బతుకమ్మ ఉత్సవాలకు భారీగా ఏర్పాట్లు

October 17, 2018
img

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అన్నీ జిల్లాలలో ఘనంగా జరుగుతున్నాయి. ఈసారి కూడా అమెరికా, జర్మనీ, లండన్ తదితర విదేశాలలో స్థిరపడిన తెలంగాణవాసులు ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు జరుపుకొంటున్నారు. గత తొమ్మిది రోజులుగా ఘనంగా సాగుతున్న బతుకమ్మ ఉత్సవాలు నేడు సద్దుల బతుకమ్మ ఉత్సవాలతో ముగుస్తాయి. దీని కోసం అధికారులు హైదారాబాద్ టాంక్ బంద్ వద్ద భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. సద్దుల బతుకమ్మ ముగింపు ఉత్సవాల సందర్భంగా మహా ఊరేగింపు కార్యక్రమం, వెయ్యి మండి కళాకారులతో కళా ప్రదర్శనలు, లేజర్ షో, బతుకమ్మల ఊరేగింపు, అనంతరం బతుకమ్మ నిమ్మజన కార్యక్రమాలు నిర్వహిస్తామని రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ మీడియాకు తెలిపారు.ఈ కార్యక్రమాలన్నిటినీ చూసేందుకు ఎక్కడికక్కడ భారీ స్క్రీన్లు అమర్చారు.

గణేశ్ నిమ్మజనాలకు వినియోగించిన చెరువులనే బతుకమ్మ నిమ్మజనాలకు కూడా వినియోగిస్తామని జి.హెచ్.ఎం.సి. అధికారులు తెలిపారు. బతుకమ్మ నిమ్మజనాల కోసం ట్యాంక్ బండ్ వద్ద ప్రత్యేకంగా ఘాట్ ఏర్పాటు చేశామని చెప్పారు. బతుకమ్మ ఉత్సవాలకు నేడు చివరిరోజు కావడంతో హైదారాబాద్ తో సహా రాష్ట్రంలో అన్నీ జిల్లాలలో ముఖ్య కూడళ్ళలో బతుకమ్మలను ఏర్పాటు చేశారు. 

Related Post