ఆ విషయంలోనూ మనమే నెంబర్: 1

August 18, 2018
img

తెలంగాణా రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశంలో నెంబర్: 1 స్థానంలో నిలుస్తుండటం మనందరికీ గర్వకారణమే. సోషల్ మీడియాను వినియోగించుకోవడంలో కూడా హైదరాబాద్‌వాసులే దేశంలో నెంబర్: 1 స్థానంలో నిలిచారు. అయితే అందుకు మనం గర్వపడే బదులు కాస్త ఆలోచించవలసిన ఆవసరం ఏర్పడింది. ఎందుకంటే, రోజంతా ఉరుకుల పరుగులతో జీవితం గడిపే హైదరాబాద్‌వాసులు రాత్రి హాయిగా నిద్రపోకుండా అర్దరాత్రి వరకు పడకగదిలో మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ లలో సోషల్ మీడియాలో చాటింగ్ చేస్తున్నారని, వీడియోలు, సినిమాలు చూస్తుంటారని ‘స్లీపింగ్ ట్రెండ్స్’ పేరిట ‘సెంచురీ మ్యాట్రస్’ సంస్థ జరిపిన తాజా సర్వేలో తేలింది. 

ఈ సంస్థ ఆన్-లైన్ లో దేశవ్యాప్తంగా 10,000 మందిని ప్రశ్నించి ఈ ఫలితాలు ప్రకటించింది. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో 10,000 మంది అభిప్రాయాలను ప్రామాణికంగా తీసుకోలేము కానీ అవి వాస్తవ పరిస్థితులను అద్దం పడుతున్నాయని చెప్పక తప్పదు. రోజంతా పని ఒత్తిడికి తోడు పడకగదులలోకి సోషల్ మీడియా వ్యాపించడం వలన భార్యాభర్తల మద్య ఇంకా దూరం పెరిగే అవకాశం ఉంది. వారి వైవాహిక జీవితాలు దెబ్బ తినే ప్రమాదం కూడా ఉంటుంది.  

సెంచురీ మ్యాట్రస్ యొక్క స్లీపింగ్ ట్రెండ్స్ సర్వే వివరాలు: 

పడకగదిలో మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నవారు:


Related Post