తిరుమల భక్తులకు గమనిక

July 11, 2018
img

తిరుమల వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి తిరుపతి బయలుదేరబోతున్నారా?అయితే ఇది మీ కోసమే. ఆగస్ట్ 12 నుంచి 16 వరకు 5 రోజులపాటు తిరుమల ఆలయాన్ని మూసివేసి మహాసంప్రోక్షణం నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. కనుక ఆ 5 రోజులు భక్తులకు స్వామివారి దర్శనాలు నిలిపివేయనున్నారు. ఈ నెల 24వ తేదీన జరుగబోయే టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందిమహాసంప్రోక్షణ తేదీలను టిటిడి ఇంకా ఖరారు చేయనప్పటికీ ఆ సమయంలో ఆర్జితసేవలకు టికెట్లను విక్రయించలేదు. అంటే అదే సమయంలో మహాసంప్రోక్షణం నిర్వహించడం ఖాయం అని స్పష్టం అవుతోంది. 

ప్రతీ 12 ఏళ్ళకు ఒకసారి నిర్వహించే ఈ మహాసంప్రోక్షణంలో ఏమి చేస్తారంటే, వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం గర్భాలయంలో మరమత్తులు చేస్తారు. ఆ పనులను స్వయంగా స్వామివారికి నిత్యం పూజలు చేసే అర్చకులే చేస్తారు తప్ప బయటవారిని లోనికి అనుమతించరు. ఆ సమయంలో ఆలయ సిబ్బంది సైతం బంగారు వాకిలి దాటి లోనికి ప్రవేశించడం నిషేధం.

కనుక తిరుమల బయలుదేరబోతున్న భక్తులందరూ ఈ మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని గుర్తుంచుకొని తదనుగుణంగా ప్రయాణాలను మార్చుకోవడం మంచిది. లేకుంటే ఆ సమయంలో తిరుమల చేరుకొంటే దైవదర్శనం లభించక నిరాశతో వెనుతిరగవలసి వస్తుంది.

Related Post