మోడీ పబ్లిసిటీకి రూ. 3,755 కోట్లు మటాష్!

December 09, 2017


img

ప్రధాని నరేంద్ర మోడీ తాను ఒకప్పుడు ఒక సాధారణ ఛాయ్ వాలానని సగర్వంగా చెప్పుకొంటారు. కనుక అయన పొదుపుగా, చాలా నిరాడంబరంగా గడుపుతారని ప్రజలు ఆశిస్తే తప్పుకాదు. కానీ గత మూడేళ్ళలో అయన ప్రచారం కోసం కేంద్రప్రభుత్వం ఏకంగా రూ.37,54,06,23,616 ఖర్చు చేసింది. ఈ విషయం గ్రేటర్ నోయిడాకు చెందిన రాం వీర్ తన్వార్ అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం క్రింద అడిగిన ప్రశ్నకు కేంద్రప్రభుత్వం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. దానిలో ఏ మాధ్యమాలలో ప్రచారానికి ఎంత ఖర్చు పెట్టిందీ వివరాలు కూడా ఇచ్చింది. 

ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం కోసం రూ.1,656 కోట్లు, ప్రింట్ మీడియాలో ప్రచారం కోసం రూ.1,656 కోట్లు, హోర్డింగులు, ఫ్లెక్సీ బ్యానర్లు, పోస్టర్లు వగైరాల కోసం మరో రూ.399 కోట్లు ఖర్చుపెట్టినట్లు తెలియజేసింది. అన్నీ కలిపి మొత్తం రూ. రూ.37,54,06,23,616 ఖర్చయినట్లు ప్రభుత్వం తెలియజేసింది. ఇక మోడీ దేశంలో ఉన్నప్పుడే ఇంత ఖర్చు చేస్తే, ఇక విదేశీయాత్రల ఖర్చు ఇంతకు పదింతలు ఉన్నా ఆశ్చర్యం లేదు. గ్యాస్ పై సబ్సీడీని వదులుకోమని పిలుపునివ్వడం ద్వారా దేశానికి వేలకోట్లు పొదుపు చేశానని గొప్పలు చెప్పుకొంటూ మరోపక్క ఈవిధంగా వేలకోట్లు ప్రచారానికి, ఖరీదైన సూటుబూట్లకు, విదేశీ యాత్రలకు ఖర్చుచేస్తుండటం వలన ఏమి ప్రయోజనం ఉంటుంది?    



Related Post