కాళేశ్వరం ప్రాజెక్టుపై రేపు పూర్తిస్థాయి సమీక్ష

December 08, 2017


img

ముఖ్యమంత్రి కెసిఆర్ గురు,శుక్రవారాలలో రెండు రోజులపాటు కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే వర్షాకాలంలోగా ప్రాజెక్టు పనులను పూర్తిచేసి గోదావరి నీటిని వాడుకొనేందుకు పనులను మరింత వేగవంతం చేయాలని కోరారు. మేడారం, లక్ష్మీపూర్ బారేజీల ద్వారా వచ్చిన నీటిని వరద కాల్వలో 99వ కిలోమీటర్ వద్ద కలపాలని ముఖ్యమంత్రి కెసిఆర్ సూచించారు. రోజుకు రెండు టిఎంసీల నీటిని పంప్ చేయడానికి వీలుగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ప్రాజెక్టు పనుల పరిశీలనలో గమనించిన విషయాలపై సమగ్రంగా చర్చించేందుకు శనివారం మాధ్యాహ్నం 11-11.30 గంటలకు ప్రగతి భవన్ లో అందరం సమావేశం అవుదామని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. కాంట్రాక్ట్ కంపెనీల సిఈఓలు, ఈ ప్రాజెక్టుల మేనేజర్లు, ఇంజనీర్లు, మంత్రి హరీష్ రావు, స్థానిక ప్రజా ప్రతినిధులు రేపటి సమావేశానికి హాజరు కావాలని కోరారు. దీని కోసం రేపు 4-5 గంటల సమయం కేటాయించి కాళేశ్వరం ప్రాజెక్టుపై అన్నీ చర్చించుకొందామని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. 


Related Post