ఆధార్ లింకేజ్ గడువు పొడిగించిన కేంద్రం

December 07, 2017


img

ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లు, గ్యాస్ కనెక్షన్, పాన్ కార్డు, స్థిరాస్తి క్రయవిక్రయాలు ప్రతీదీ ఆధార్ తో అనుసంధానం తప్పనిసరి అవుతోంది. ప్రభుత్వ పధకాలలో ఇక సరేసరి. ఏ పధకంలో పేరు నమోదు చేసుకొని లబ్దిపొందాలన్నా ఆధార్ తప్పనిసరి. అయితే ప్రభుత్వ పధకాలకు ఆధార్ తప్పనిసరి చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ పై కేంద్రం తరపున అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ స్పందిస్తూ, మార్చి 31వరకు గడువు పొడిగించడానికి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అయితే ఇంతవరకు ఆధార్ కార్డు లేనివారికి మాత్రమే అది వర్తిస్తుందని తెలిపారు. మొబైల్-ఆధార్ అనుసంధానికి విధించిన ఫిభ్రవరి 6 గడువులో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేశారు. కనుక ప్రజలందరూ తమ బ్యాంక్ అకౌంట్లను, పాన్ కార్డులను, గ్యాస్ కనెక్షన్లను, మొబైల్ ఫోన్లను వీలైంత త్వరగా ఆధార్ తో అనుసంధానం చేసుకోవడం మంచిది. లేకుంటే ఆఖరు నిమిషంలో వెళితే గంటలకొద్దీ క్యూలైన్లలో నిలబడక తప్పదు.     



Related Post