ఏమిటా గులాబీ కూలి?

December 07, 2017


img

ఈ ఏడాది ఏప్రిల్ 27న వరంగల్ ల్లో జరిగిన తెరాస ప్లీనరీ సభల నిర్వహణ కోసం తెరాస మంత్రులు, ప్రజా ప్రతినిధులు అందరూ గులాబీ కూలి పేరిట రకరకాల పనులు చేసి కోట్ల రూపాయల విరాళాలు పోగుచేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అధికారంలో ఉన్నవారు ఈవిధంగా గులాబీ కూలీ పేరిట ఆసుపత్రులు, వ్యాపార సంస్థలు తదితర సంస్థల నుంచి బలవంతంగా డబ్బు వసూలుచేయడంపై అప్పుడే సర్వత్రా విమర్శలు వెలువెత్తాయి. కానీ తెరాస నేతలు, ప్రజా ప్రతినిధులు వాటిని లెక్క చేయలేదు.

అధికారంలో ఉన్నవారు ఆవిధంగా బలవంతంగా డబ్బు వసూలుచేసి అక్రమాలకు పాల్పడ్డారని కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఏసిబికి పిర్యాదు చేశారు. కానీ తెరాస సర్కార్ క్రింద పనిచేస్తూ దానిలో మంత్రులు, ప్రజా ప్రతినిధులపై ఎసిబి చర్యలు తీసుకొనే సాహసం చేయగలదని ఆశించలేము కనుక అదే జరిగింది. ఎసిబి స్పందించకపోవడంతో రేవంత్ రెడ్డి ఈ గులాబీ కూలీ వ్యవహారం గురించి పిర్యాదు చేస్తూ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. దానిపై బుదవారం విచారణ జరిపిన హైకోర్టు జస్టిస్ ఎస్.వి.భట్, రేవంత్ రెడ్డి పిర్యాదుపై ఏసిబి కేసు నమోదు చేసిందా లేదా చేస్తే ఏమి చర్యలు తీసుకొందో తెలియజేయాలంటూ నోటీసు పంపింది. ఈ కేసు తదపరి విచారణను డిసెంబర్ 13కి వాయిదా వేసింది. 


Related Post