నావికాదళంలో చేరిన ఫస్ట్ బ్యాచ్ మహిళా పైలట్లు

November 23, 2017


img

భారత నావికాదళ చరిత్రలో బుధవారం ఒక అపూర్వమైన సంఘటన జరిగింది. కేరళలోని కన్నూర్ వద్ద గల ఇండియన్ నేవేల్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకొన్న326 మంది మహిళా అధికారులు నావల్ అర్మమేంట్ ఇనస్పెక్షన్ (ఎన్.ఏ.ఐ.)లో భాగంగా జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్ లో నావికాదళంలో చేరారు. భారత వాయుసేనలో యుద్ధవిమానాలు నడిపే మహిళా పైలెట్లున్నారు కానీ నావికాదళంలో లేరు. నిన్న జరిగిన ఈ కార్యక్రమంలో మొట్టమొదటి బ్యాచ్ మహిళా పైలెట్స్ భారత నావికాదళంలో చేరారు. 

ఇంతవరకు యుద్ధవిమానాలు, యుద్దనౌకలు, సబ్-మెరైన్లు నడపడం కేవలం పురుషులకు మాత్రమే పరిమితం అనుకొనేవారు కానీ అత్యంత క్లిష్టమైన ఆ పనులను కూడా మహిళలు అలవోకగా నిర్వహించగలగడం అభినందనీయం. భారత్ లో మహిళలు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా పోటీ పడగలరని, వారికీ సామానావకాశాలున్నాయని చెప్పేందుకు ఇదే ఒక చక్కటి ఉదాహరణ. నిన్న జరిగిన ఈ కార్యక్రమంలో మాల్దీవులు, టాంజానియా దేశాలకు చెందిన ఒక్కో మహిళా అధికారి కూడా విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకొని తమ తమ దేశాలకు సేవలు అందించబోతున్నారు.

భారత వాయుసేనలో మొట్టమొదటి మహిళా పైలెట్ పేరు హరిత కౌర్ డియోల్. ఆమె నవంబర్ 10, 1971 లో చేరి 24, డిసెంబర్ 1996లో పదవీ విరమణ చేశారు.

 



Related Post