రాష్ట్రంలో సిరిసిల్ల నెంబర్: 1

September 25, 2017


img

జాతీయ పట్టణ పారిశుద్ధ్య పాలసీలో భాగంగా కేంద్రప్రభుత్వం చేపట్టిన ‘స్వచ్చా భారత్’ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా నెంబర్: 1 స్థానం దక్కించుకొంది. ఇటీవల కేంద్రప్రభుత్వ బృందాలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో పర్యటించి బహిరంగ మలవిసర్జన (ఓడిఎఫ్), మురుగునీరు పారుదల, చెత్త తరలింపు, దాని రీ-సైక్లింగ్, గ్రామాలలో పారిశుద్యం త్రాగునీరు మొదలైన అంశాలపై ఒక సమగ్రమైన సర్వే నిర్వహించి నివేదికలు తయారుచేశాయి. వాటి ఆధారంగా తెలంగాణాలో రాజన్న సిరిసిల్ల, ఛత్తీస్ ఘడ్ లో ధంతేరి, పశ్చిమ బెంగాల్ లో నదియా, హుగ్లీ, మధ్యప్రదేశ్ లో గ్వాలియర్ జిల్లాలకు స్వచ్చ భారత్ లో నెంబర్: 1 ర్యాంక్ ఇస్తున్నట్లు ప్రకటించింది. 

ఒకప్పుడు సిరిసిల్ల పరిశుభ్రతలో అట్టడుగు స్థానంలో ఉండేది. కానీ సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేటిఆర్ రాష్ట్ర మునిసిపల్ శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జిల్లాలో మార్పులు మొదలయ్యాయి. మంత్రి కేటిఆర్, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ప్రోత్సాహం వారు అందించిన సహాయ సహకారాలతో మహిళా సంఘాలు, ప్రజలు కలిసికట్టుగా కృషి చేసి తమ జిల్లాను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో ఈ విజయం సాధ్యం అయ్యింది. దీనిని స్పూర్తిగా తీసుకొని మిగిలిన జిల్లాల మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు కూడా తమతమ జిల్లాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి కృషి చేస్తే బాగుంటుంది. 


Related Post