కేసీఆర్ కు రామోజీరావు లేఖ....ఎందుకో?

September 23, 2017


img

ముఖ్యమంత్రి కేసీఆర్ ను అభినందిస్తూ రామోజీ గ్రూప్ చైర్మన్ రామోజీరావు నిన్న ఒక లేఖ వ్రాశారు. హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తుంనందుకు, 12వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలో తెలుగు సబ్జెక్ట్ ను తప్పనిసరి చేసినందుకు అభినందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా మంచి నిర్ణయం తీసుకొన్నారని రామోజీరావు అభినందించారు.

ప్రభుత్వం తీసుకొన్న ఈ రెండు నిర్ణయాల పట్ల ఇప్పటికే చాలా మంది ప్రముఖులు తమ సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అభినందించారు. ఈనాడు గ్రూప్ కూడా తెలుగు బాష పట్ల అపారమైన అభిమానం చూపిస్తూ, దాని అభివృద్ధికి గట్టిగా కృషి చేస్తోంది కనుక రామోజీరావు కూడా ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలకు సంతోషించి ee లేఖ వ్రాసినట్లు భావించవచ్చు. అయితే రామోజీ రావు  ఏ పని చేసినా దానికి అర్ధంతో బాటు పరమార్ధం కూడా వేరేగా ఉంటుందని చెప్పక తప్పదు. హైదరాబాద్ లో జరుగబోయే ప్రపంచ తెలుగు మహా సభలలో ఈనాడు గ్రూప్ కూడా భాగస్వామ్యం ఉండేందుకు, దేశవిదేశాల నుంచి అక్కడికి వచ్చే అతిధులను వీలైతే తన రామోజీ ఫిలిం సిటీని సందర్శింపజేయవచ్చని ఆలోచిస్తున్నారేమో? తద్వారా స్వామికార్యంతో పాటు స్వకార్యం కూడా నెరవేరుతుంది కదా? 


Related Post