నా భార్యకు గుర్మీత్ తో అక్రమ సంబంధం ఉంది: గుప్తా

September 22, 2017


img

డేరా బాబా అదే...గుర్మీత్ రాం రహీం సింగ్ జైల్లోకి వెళ్ళిన తరువాత గానీ ఎవరికీ అతని గురించి మాట్లాడటానికి ధైర్యం రాలేదు. అతని పెంపుడు కూతురుగా చెప్పుకోబడుతున్న హనీప్రీత్ సింగ్ గురించి ఆమె మాజీ భర్త విశ్వాస్ గుప్తా ఈరోజు మీడియా ముందుకు వచ్చి చాలా ఆసక్తికరమైన విషయాలే చెప్పాడు. 

“ఒకప్పుడు నేను, నా భార్య హనీప్రీత్ సింగ్ తో కలిపి మొత్తం ఆరు జంటలు 28 రోజులు డేరా సౌధాలో గడిపేము. అప్పుడే నా భార్యతో గుర్మీత్ కు మద్య అక్రమ సబంధం ఏర్పడింది. వారిద్దరూ శృంగారం చేస్తుండగా నేను స్వయంగా నా కళ్ళతో చూశాను. కానీ ఎవరికైనా చెపితే నన్ను చంపేస్తానని బెదిరించారు. వారిరువురి మద్య అక్రమ సంబంధం ఉన్నప్పటికీ బయట ప్రపంచానికి మాత్రం ఆమె తన పెంపుడు కూతురు అని చెప్పుకొనేవాడు. ఆమె కూడా అందరితో అలాగే చెప్పుకొనేది. వారిరువురూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేక పోయేవారు. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరూ కలిసే వెళ్ళేవారు. ఒకే గదిలో ఉండేవారు. వారిమధ్య ఉన్నదీ తండ్రీకూతుళ్ల సంబంధం కాదు. అక్రమ సంబంధం. ఇక గుర్మీత్ దగ్గర ఎప్పుడూ ఆయుధాలతో కూడిన ఒక బాక్స్ ఉంటుంది. అతను ఎక్కడికి వెళ్ళినా దానిని వెంట తీసుకువెళుతుంటాడు. అతని నీచమైన బుద్ధుల గురించి అతనికి సన్నిహితంగా మెలిగిన వారందరికీ తెలుసు కానీ బయటకు చెపితే చంపేస్తాడనే భయంతో నోరు మూసుకొని ఏమీ తెలియనట్లు ఉండేవారు,” అని హనీప్రీత్ సింగ్ మాజీ భర్త విశ్వాస్ గుప్తా చెప్పాడు.  


Related Post