వాటిని మేము కూడా వ్యతిరేకిస్తున్నాం: వైసిపి

September 13, 2017


img

మళ్ళీ చాలా రోజుల తరువాత తెలంగాణాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గొంతు వినబడింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి మంగళవారం నల్లగొండలో మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణా రైతు సమన్వయ సమితుల ఏర్పాటు కోసం తెరాస సర్కార్ జారీ చేసిన జీవో: 39ను మా పార్టీ వ్యతిరేకిస్తోంది. ఏపిలో చంద్రబాబు జన్మభూమి కమిటీలు వేసి తన పార్టీ నేతలు, కార్యకర్తలకు ప్రభుత్వ సొమ్ము దోచిపెట్టినట్లుగానే, ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ సమితుల ద్వారా తెరాస నేతలకు లబ్ది కలిగించేందుకు ప్రయత్నిస్తున్నట్లున్నారు. 

ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఈ సమితుల వలన అర్హులైన రైతులకు ప్రయోజనం ఉంటుందో లేదో తెలియదు కానీ రైతుల మద్య చిచ్చు రగిలించే ప్రమాదం ఉంది. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో ఘోరంగా విఫలమైన తెరాస సర్కార్ ఈ సమితుల ఏర్పాటుతో ప్రశాంతంగా ఉన్న పల్లెలలో చిచ్చు పెడుతోంది. 

ఈ జీవో నెంబర్: 39ను, దానితో రైతు సమన్వయ సమితుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ రేపు అంటే గురువారం నాడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో కలెక్టరేట్ కార్యాలయాలు, ఆర్డివో కార్యాలయాల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నాలు చేసి నిరసనలు తెలియజేయాలని పిలుపునిస్తున్నాను,” అని అన్నారు.


Related Post