అయ్యో ఛార్మీ...ఇలా అయ్యిందేమిటి?

July 25, 2017


img

డ్రగ్స్ కేసులో సిట్ విచారణ జరుగుతున్న తీరును తప్పుపడుతూ ఛార్మీ హైకోర్టులో నిన్న పిటిషన్ వేయడం చాలా సంచలనం సృష్టించింది. అది ఈ కేసులను పెద్ద మలుపు తిప్పేయబోతోందని మీడియా తెగ వర్ణించేసింది. 

ఛార్మీ తన పిటిషన్ లో తన గొప్పదనం గురించి చెప్పుకొని, తానొక పెళ్ళికాని కన్యనని సిట్ విచారణ వలన తన ప్రాధమిక హక్కులకు భంగం కలుగుతుందని చాలా చెప్పుకొంది. కానీ హైకోర్టు ఆమె వాదనలను, భయాలను త్రోసిపుచ్చి విచారణకు హాజరుకావలసిందేనని తేల్చి చెప్పింది. 

ఆమె అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకొని ఆమె కోరుకొన్నట్లుగా న్యాయవాదుల సమక్షంలో మహిళా అధికారులే ఆమెను విచారించాలని, ఆమె అనుమతి లేకుండా రక్తం, గోళ్ళు, జుట్టు వగైరాలు సేకరించకూడదని సిట్ బృందానికి సూచించింది. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5లోగా విచారణ పూర్తి చేయాలని సూచించింది. 

అయితే హైకోర్టు సూచించిన ఈ ఆదేశాలను సిట్ మొదటి నుంచే ఆచరిస్తోంది. పురుషులను మాత్రం రాత్రి పొద్దుపోయే వరకు విచారించడానికి సుప్రీంకోర్టు కూడా అనుమతిస్తుంది కనుక వారిని మాత్రమే విచారిస్తోంది. నిందితుల రక్తం, గోళ్ళు, జుట్టును వారు అనుమతించినట్లయితేనే సేకరిస్తున్నామని అకున్ సబర్వాల్ నిన్ననే చెప్పారు. నిన్న విచారణకు హాజరైన తరుణ్ వాటిని ఇవ్వడానికి నిరాకరించడంతో సిట్ అధికారులు ఆ విషయం కేసు ఫైలులో వ్రాసుకొన్నారు తప్ప ఇవ్వమని అతనిని బలవంతం చేయలేదు. కనుక ఛార్మీ పని కొండను త్రవ్వి ఎలుకను పట్టినట్లు అయ్యింది. కనుక రేపు అందరిలాగే విచారణను ఎదుర్కోక తప్పదు. తను నిర్దోషినని నిరూపించుకోక తప్పదు. 


Related Post