టిసిఎస్ ఉద్యోగులు ధర్నా!

July 24, 2017


img

టిసిఎస్ ఉద్యోగులు భయపడినట్లే జరిగింది...లక్నోలోని టిసిఎస్ కార్యాలయం మూసివేసి అందులో పనిచేస్తున్న ఉద్యోగులను వేరే ప్రాంతాలకు బదిలీ చేయాలని ఆ సంస్థ నిర్ణయించింది. దానితో ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి లక్నో రోడ్లపై ఈరోజు ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. ఇంతకాలం సేవలందించిన తమ పట్ల సంస్థ ఈవిధంగా వ్యవహరించడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నగరం నుంచి టిసిఎస్ తరలిపోతే ఆ ప్రభావం మిగిలిన ఐటి సంస్థలపై పడి అవి కూడా తరలిపోతే హటాత్తుగా రాష్ట్రంలో ఐటి రంగం దెబ్బ తింటుందని వారు వాదిస్తున్నారు. వారికి స్వచ్చంద సంస్థలు, ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతు పలుకుతున్నాయి. 

కానీ లక్నో నుంచి టిసిఎస్ తరలింపు అనివార్యంగానే కనిపిస్తోంది. అమెరికాకు సేవలందిస్తున్న విదేశీ సంస్థలు, ఉద్యోగుల విషయంలో అమెరికా ప్రభుత్వం తీసుకొంటున్న నిర్ణయాల కారణంగా భారత్ లోని అన్ని ఐటి సంస్థలు నష్టనివారణ చర్యలు చేపట్టక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. లేకుంటే వాటి ఉనికే ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం ఉంటుంది. టిసిఎస్ అందుకు మినహాయింపు కాదు కనుకనే ఇంత కటినమైన నిర్ణయం తీసుకొంది. 

అయితే ఉద్యోగులు తమ సంస్థ ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులను అర్ధం చేసుకొని డానికి సహకరించడమే మంచిది. లేదా ప్రత్యమ్నాయ మార్గాలు సిద్దం చేసుకోక తప్పదు. అదేవిధంగా ఐటి కంపెనీలు కూడా హటాత్తుగా ఉద్యోగులను తొలగించే బదులు వారికి ప్రత్యామ్నాయ మార్గాలు లేదా అవకాశాలు చూపించగలిగితే బాగుంటుంది. కనీసం ఇప్పటికైనా మన ఐటి సంస్థలు స్వావలంభన సాధించేందుకు తమ ముందున్న మార్గాలను అన్వేషిస్తే దేశంలోని ఐటి రంగం దృడంగా నిలబడగలుగుతుంది. 


Related Post